సాహో సర్ ప్రైజ్..

505

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు సాహో దర్శక నిర్మాతలు. సాహో సినిమాకి సంబంధించి చాప్టర్-1 పేరుతో ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. అబుదాబిలో 30 రోజుల పాటు చిత్రీకరించిన సన్నివేశాలను ఇందులో చూపించారు. పోలీసుల కార్లను ప్రత్యేకంగా రూపొందించడం, కారు ఛేజింగ్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఈ టీజర్‌ ద్వారా తెలుస్తోంది. దాదాపు 400 మంది టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేశారు. సుజిత్‌ దర్శకుడు, శ్రద్ధా కపూర్ హీరోయిన్.