ఉదయం ఇచ్చారు. సాయంత్రానికి అమ్మేశారు.

76

నెల్లూరు జిల్లాలో మత్స్యకారులకు వలలు, సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఓ ప్రహసనంలా మారిందని జడ్పీ సమావేశంలో విమర్శించారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. అర్హులకు అందాల్సిన ఉపకరణాలు పక్కదారి పట్టాయని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మత్స్యకార సొసైటీలు ఎక్కడున్నాయి, వాటిలో సభ్యులెవరు అనే విషయాన్ని బైటపెట్టాలన్నారు.