స్వర్ణాల చెరువులో శివుడు..

139

హైదరాబాద్ లోని హుస్సేనే సాగర్ లో బుద్ధుని విగ్రహం లాగే.. నెల్లూరు స్వర్ణాల చెరువు మధ్యలో శివలింగాన్ని వెలికితీసి పున: ప్రతిష్టిస్తామని అన్నారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. నెల్లూరులో ఏర్పాటు చేయబోతున్న ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలసి ఆయన పర్యవేక్షించారు. గతంలో చోళులు స్వర్ణాల చెరువులో ప్రతిష్టించిన శివలింగాన్ని వెలికి తీసే కార్యక్రమం కోటి సోమవారం రోజున ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. శివలింగానికి నిత్యం జలాభిషేకం జరిగేలా చేస్తామని, ప్రఖ్యాత పర్యాటక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దుతామని అన్నారు.