ఇనుప కొక్కేలకు వేలాడుతూ..

792

హీరోలపై అభిమానంతో కటౌట్ లకు పాలాభిషేకాలు చేసేవాళ్లను చూస్తుంటాం. కానీ వీడెవడో మరీ వెర్రి వీరాభిమానిలా ఉన్నాడు. వీపుకి ఇనుప కొక్కేలు తగిలించుకుని క్రేన్ కు వేలాడుతూ 25అడుగుల ఎత్తున్న హీరో శింబు కటౌట్ కి పాలాభిషేకం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానం పేరుతో ఇతడు చేసిన పనిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కారణం ఇదీ..
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నవాబ్‌ సినిమా తమిళనాట చెక్క చివంత వానం పేరుతో రిలీజ్‌ అయింది. ఈ సినిమాలో శింబు కీలక పాత్రలో నటించాడు. చాలా రోజులుగా ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న శింబు ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అభిమాని అత్యుత్సాహంతో చేసిన ఈ పని విమర్శలకు కారణమైంది.