అదేపనిగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా..?

534

మొబైల్ ఫోన్లతో ఇప్పటి వరకూ రేడియేషన్ ముప్పు పొంచి ఉందని తెలుసుకున్నాం, అదే పనిగా ఫోన్ స్క్రీన్ చూస్తే మెడలు వంగిపోతాయి, కంటి చూపు పై ప్రభావం చూపుతుందనే విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా ఓ యువతి అదేపనిగా స్మార్ట్ ఫోన్ వాడుతూ చేతివేళ్లు వంగిపోయే అరుదైన వ్యాధికి గురైంది. వేళ్ల కదలిక కోల్పోయింది, బిగుసుకు పోయిన చేతివేళ్లు వైద్యులు చికిత్స అనంతరం మామూలుగా అయ్యాయి.
చైనాకు చెందిన షాంఘైలిస్ట్‌ పత్రిక కథనం ప్రకారం.. హునాన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువతి స్మార్ట్‌ఫోన్‌కు బానిస. తన ఉద్యోగానికి వారం రోజులు సెలవు పెట్టి మరీ సమయాన్నంతా ఫోన్‌ను వినియోగిస్తూనే ఉంది. కేవలం నిద్రపోయేటప్పుడే ఫోన్‌ను వదిలిపెట్టేది. ఇలాగే రోజు చేయడంతో చేతులు నొప్పి పెట్టి.. చివరికి ఆమె వేళ్లు వంగిపోయి బిగుసుకుపోయాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఏ విధంగా పట్టుకుని ఉందో అదే పొజిషన్‌లో ఆమె వేళ్లు కూడా ఉండిపోయాయి. తిరిగి మామూలు స్థితికి రాలేకపోయాయి. దీంతో ఆమె వైద్యులను సంప్రదించింది. అదృష్టవశాత్తూ ఆమె వేళ్లను వైద్యులు తిరిగి మామూలు స్థితికి తీసుకురాగలిగారు. కానీ ఆమె స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.