మంగుళూరు సెకండ్ ఏసీలో పాము..

860

రైలులో ఎలుకలు, బొద్దింకలు, దోమలు ఇవన్నీ సహజం. అయితే ఏకంగా ఇప్పుడు పాములే చొరబడ్డాయి. అదీ సెకండ్ క్లాస్ ఏసీలో. మంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఓపాము కనపడ్డంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. కాసేపటికి పాములు పట్టే వ్యక్తిని పిలిపించి పాముని పట్టేశారు. ఆ తర్వాత అధికారులు ఓ ఉచిత సలహా పారేశారు. ప్రయాణికులు పడుకునే ముందు, బెర్త్ లో దిండ్లు, దుప్పట్లు.. కింద్ పైన అంతా చూసుకుని పడుకోవాలంటూ సలహా ఇచ్చారు.