అమెరికాలో ఆటవిడుపు..

2723

ఎప్పుడూ వైట్ అండ్ వైట్ డ్రస్ లో కనిపిస్తుంటారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసినా సగం వరకు చేతులు మడవడం ఆయన ప్రత్యేకత. అయితే అమెరికా పర్యటనలో మాత్రం నీటుగా సూటులోకి మారిపోయారు సోమిరెడ్డి. సహచర మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు పరకాల ప్రభాకర్ తో కలసి ఆటవిడుపుగా అయోవా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతంలో సరదాగా ఫొటోలు దిగారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెగా సీడ్ పార్క్ కార్యకలాపాల్లో విదేశీ సంస్థల సహకారంకోసం అమెరికాలోని అయోవా స్టేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. రెండురోజుల చర్చలు ముగియడంతో రాష్ట్ర మంత్రులు సరదాగా కొన్ని ప్రముఖ ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. అక్కడ దిగినవే ఈ ఫొటోలు..

somireddy 1