జగన్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్..

89

జగన్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ పర్యటనకు రోజూ 50లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ప్రజా సమస్యలు తెలుసుకోడానికి జగన్ పాదయాత్ర చేయలేదని మండిపడ్డారు. శాసన సభకు రాకుండా జీతాలు తీసుకున్న ఘనత వైసీపీ ఎమ్మెల్యేలకే దక్కుతుందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వ్యవస్థలు కుప్పకులాయని అన్నారు. జగన్ నవరత్నాలు అని ప్రచారం చేసుకుంటున్నారని, ఆయన తండ్రి హయాంలో నవగ్రహాలు రాష్ట్రాన్ని పట్టి పీడించాయని ఎద్దేవా చేశారు.