పందెం కోళ్లను పరిశీలించిన మంత్రి సోమిరెడ్డి..

106

కల్లూరుపల్లి హౌసింగ్ కాలనీ దగ్గర మహావీర్ జైన్ పశు సేవా కేంద్రాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. పశువులు, పక్షులను నిర్వాహకులు సేవా తత్పరతతో సంరక్షిస్తున్నారని ఆయన అభినందించారు. ఆవులు, కుక్కలు, పావురాళ్లు, పందాల్లో దెబ్బతిన్న కోడిపుంజులను కూడా ఇక్కడకు తీసుకొచ్చి కాపాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తరపున వారికి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.