టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్..

91

టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్..
కాకాణికి సోమిరెడ్డి హెచ్చరిక..
కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రచారానికి ఏఊరెళ్లినా టీడీపీ సంస్కారం లేకుండా ప్రవర్తించలేదని, కానీ వారు మాత్రం టీడీపీ ప్రచారానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఐదేళ్లు మంత్రిగా ఉండేవాడినని.. ఈసారి సర్వేపల్లిలో కచ్చితంగా గెలిపించండని ప్రజలను అభ్యర్థించారు. వెంకటాచలం మండలం యర్రగుంట, అనపల్లిపాడు, రామదాసు కండ్రిగ, ఇడిమేపల్లి, ఈదగాలి, పూడిపర్తి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు టీడీపీలో చేరారు.