ఈ లోకం వదిలి ఏడాది …అతిలోక సుందరి చివరి క్షణాల వీడియో ..

263

 

 

తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి శ్రీదేవి. వెండితెర అతిలోక సుందరిగా అందరి మనసుల్లోను చెరగని ముద్రవేసుకున్న ఆమె హఠాన్మరణం చెంది నేటికి ఏడాది పూర్తయ్యింది. బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్‌ వెళ్లిన ఆమె గతేడాది ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు. ఆమె తొలి వర్ధంతి సందర్భంగా శ్రీదేవి చివరి సారిగా కనిపించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

జూన్‌ 2 శ్రీదేవీ, బోనీకపూర్‌లో పెళ్లిరోజు. గతేడాది ఆరోజు శ్రీదేవిని స్మరించుకుంటూ బోనీకపూర్‌ ఆమె ట్విటర్‌ ఖాతా నుంచి ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో దుబాయ్‌లో జరిగిన పెళ్లి వేడుకలో శ్రీదేవి ఆనందంగా ఉన్న క్షణాలు, బంధువులతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేస్తూ నవ్వుతూ కనిపించారు. శ్రీదేవి చివరి సారిగా కనిపించిన వీడియో ఇదే. నేడు శ్రీదేవి తొలి వర్ధంతి సందర్భంగా ఆమె ట్విటర్‌ ఖాతాలో ఉన్న చివరి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవలే బోనీ కుటుంబం ఆమె తొలి వర్ధంతి సందర్భంగా ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 24న చనిపోయిన.. తిథి ప్రకారం ఆమె చనిపోయిన రోజు ఫిబ్రవరి 14 కావడంతో ఆరోజు చెన్నైలోని శ్రీదేవి నివాసంలో ప్రార్థనలు ఏర్పాటు చేశారు.