తాత గెటప్ లో మనవడు..

561

ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని నాగాశ్వరరావుగా ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నాడు. ఏఎన్నార్ 94వ జయంతి సందర్భంగా సుమంత్ గెటప్ ని విడుదల చేశారు. ‘ఈ రోజు ఏఎన్నార్‌ 94వ జయంతి. పుట్టినరోజు శుభాకాంక్షలు తాత. సినిమాలో ఇది నా లుక్‌’ అంటూ సుమంత్‌ ట్వీట్‌ చేశారు. ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్ ఒదిగిపోయారు. అదే తలకట్టు, కళ్లజోడుతో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు వెళ్లేటప్పుడు సుమంత్‌ తన తాతగారు వాడిన ఆఖరి కారులోనే సెట్స్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్‌ అల్లుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన దగ్గుబాటి రానా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

09573419BRK-ANR