యువనేతకు సారథ్యం..

68

కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ఏడుగుండ్ల సుమంత్ రెడ్డిని నియమించారు. సుమంత్ రెడ్డిని ఇంచార్జిగా ప్రకటిస్తూ జిల్లా పార్టీ నాయకత్వం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ హయాంలో డీసీఎంఎస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు సుమంత్ రెడ్డి. జిల్లా రైతాంగానికి చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని తనకు కోవూరు ఇంచార్జిగా బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ అధిష్టానానికి ఆయన కృజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని అందరు నాయకులను కలుపుకొని, గ్రామ స్థాయినుంచి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు.