సూపర్ స్టార్ వెనక్కి తగ్గాడు..

150

సూపర్ స్టార్ వెనక్కి తగ్గాడు..
పోటీలో లేనంటూ స్పష్టం చేశాడు..
ఎన్నికల్లో పోటీపై రోజుకోమాట చెబుతూ వస్తున్న రజినీకాంత్ ఎట్టకేలకు తనకంత సీన్ లేదని ఒప్పుకున్నాడు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని, తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని వెల్లడిస్తూ తాజాగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. తన అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీ వర్గాలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు. తమిళనాడుకు నీటి సమస్యలు లేకుండా చేసే పార్టీకే త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. అయితే తమిళనాడు ఎన్నికల టైమ్ కి రజినీకాంత్ పోటీపై మాట మారుస్తాడని అంటున్నారు.