సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

1899

ఇష్టపూర్వకంగా కొనసాగే వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 పురాతన చట్టమని.. రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. సెక్షన్‌ 497కు కాలం చెల్లింది..
సెక్షన్‌ 497 ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ కానీ ఉంటాయి. స్త్రీకు ఇవేమీ ఉండవు, ఆమెను బాధితురాలిగా పరిగణిస్తారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్‌ కూడా ఆ ఆర్టికల్‌కు లోబడే ఉండాలని, కాబట్టి ఈ సెక్షన్‌ను చెల్లబోదని పిటిషనర్‌ వాదించారు. ఒకరు ఎవరితో శృంగారం చేయాలి.. ఎవరితో చేయకూడదు అనే విషయాన్ని మరో వ్యక్తి నిర్ణయించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. వివాహం కాగానే భార్య తన ఆస్తిగా భర్త పరిగణించడం సరికాదని పేర్కొంది.