ఐయామ్ ఎ బ్యాడ్ ఉమన్.. బట్ ఎ గుడ్ మదర్..

246

‘ధూమపానం, మద్యం తాగడం వల్ల నేను చెడ్డ తల్లిని ఎలా అవుతాను?’ అని నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్‌ నటి శ్వేతా సాల్వే ‘అవును నేను తాగుతాను, ధూమపానం చేస్తాను. నేను నిజాయతీగా ఉంటాను. కేవలం మద్యం, సిగరెట్‌ తాగడం వల్ల చెడ్డ తల్లిని ఎలా అవుతాను? నా తల్లిదండ్రులు నన్ను పద్ధతిగానే పెంచారు. సమాజంలోని మంచి, చెడు తెలియజేశారు. వాళ్లు కూడా మద్యం, ధూమపానం చేసినవారే. ఇప్పటికీ ఏదన్నా వేడుక జరుపుకోవాలంటే నా తల్లిదండ్రులతో కలిసి మద్యం తాగుతాను. నా జీవితాన్ని వృథా చేసుకోవడం మీరు చూశారా? పనిచేయకుండా ఖాళీగా గడపడం చూశారా? నా పిల్లల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశారా? నిత్యం ఎన్నో పనులతో బిజీగా ఉంటాను. నేను నటిని, డ్యాన్సర్‌ను,పారిశ్రామికవేత్త‌ని కూడా. ఇతరులను నేను ఈ విధంగా ప్రశ్నించను. కాబట్టి నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరూ ఇలాంటి ప్రశ్నలు వేయకండి. మీరు నా పోస్ట్‌లకు చేసే లైక్‌లను, ఫాలోవర్లను పట్టించుకోను. మీరే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తున్నారు. నా పద్ధతి నచ్చకపోతే అన్‌ఫాలో అవ్వచ్చు’ అని వెల్లడిస్తూ మద్యం తాగుతున్న ఫొటోను షేర్‌ చేశారు.