లెక్చరర్లలను పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారా..

105

పోలీసులపై వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి చిందులు..

నెల్లూరు నగరంలో నగదుతో పట్టుబడిన నారాయణ కాలేజీ లెక్చరర్లను పోలీసులు స్టేషన్ కి తరలించారు. ఎన్నికల్లో అక్రమంగా ఓటర్లకు నగదు పంచుతున్నారంటూ వీరిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేతలు వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకి అప్పగించారు. అయితే టీడీపీ నేతలు నారాయణ కాలేజీ సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చి గొడవకు దిగారు. రౌడీల్లా ప్రవర్తించే వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ నాయకుడు, మంత్రి నారాయణ అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి సహా ఇతర టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ కి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తమవారిని వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు.