ప్రయోగాల్లో సఫలం, భద్రతలో విఫలం..

615

శ్రీహరికోట, మార్చి-4: అంతరిక్షంలోకి దిక్సూచీ ఉపగ్రహాలు పంపిస్తూ భూమి మీద ఎక్కడ ఏముందీ తెలుసుకుంటోంది షార్. కానీ పరిశోధనా క్షేత్రంలో జరిగే దొంగతనాల్ని గుర్తించడంలో మాత్రం ఇక్కడి అధికారులు వరుసగా విఫలమవుతున్నారు. తాజాగా జరిగిన దొంగతనం మరోసారి అధికారులు వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఎప్పటిలాగే ఈ సారి కూడా అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వివరాలు తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. అసలేం జరగనట్టే బిల్డప్ ఇచ్చారు. దొంగతనం జరిగిన ప్రాంతం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోనే ఉంది. అయినా సరే చోర శిఖామణులు రెచ్చిపోయారు. షార్ అధికారులు అప్రమత్తతను వెక్కిరించారు.