కుటుంబాన్ని మింగేసిన ప్రమాదం..

462

ఉదయగిరి, ఫిబ్రవరి-1: రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఐదుగురు కుటుంబ సభ్యుల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. తల్లిదండ్రులు, ఇద్దరు సోదరుల్ని కోల్పోయి ఓ చిన్నారి మాత్రం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించుకుని రోజులు గడవక ముందే ఈ బైక్ యాక్సిడెంట్ జిల్లాలో సంచలనం సృష్టించింది. గండపాలెంకు చెందిన శ్రీధర్ భార్య విజయ, పిల్లలు కార్తీక్, సాత్విక్, దీపక్ తో కలసి బైక్ పై బంధువుల ఇంటికి బయలుదేరాడు. మధ్యలో ఉదయగిరి దగ్గర ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ ని ఢీకొంది. దీంతో.. ఐదుగురిలో మొత్తం నలుగురు చనిపోయారు. దీపక్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.