లక్ష్మీపార్వతిపై వర్మ జోక్..

2764

లక్ష్మీపార్వతిని పక్కన పెట్టుకుని ఆమెపైనే సెటైర్లు వేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమాల్లో శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి అందగత్తెలతో నటించిన ఎన్టీఆర్.. వాళ్లని పక్కనపెట్టుకుని నిన్నెలా పెళ్లి చేసుకున్నాడని ప్రశ్నించారు. ఆ ముగ్గురు అందగత్తెలను పెళ్లి చేసుకోనీయకుండా మీ పర్సనాల్టీతో ఆయన్ను ఆకట్టుకున్నారు. దానికి నేను చింతిస్తున్నానని అన్నారు. ఎందుకంటే లక్ష్మీపార్వతి కంటే ఆ ముగ్గురు హీరోయిన్లకే తాను పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చారు. కానీ లక్ష్మీపార్వతి వల్ల ఈరోజు ఓ గొప్ప సినిమా తీసే అవకాశం తనకొచ్చిందని అందుకు ఆమెకు ధన్యవాదాలని చెప్పారు.