ఇడ్లీ.. వడ.. సాంబార్..

415

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాలపరీక్షకు నిలబడ్డాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గోవాలో ఓ విద్యాసంస్థ స్నాతకోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో పిజ్జాలు, బర్గర్ల స్థానాన్ని ఇడ్లీలు, దోసెలు, సాంబార్.. ఆక్రమిస్తాయని అన్నారు. ఈ మూడు వంటకాలు తరతరాలుగా కాలపరీక్షకు నిలిచి.. ఈరోజు వరకు నిలబడ్డాయని గుర్తు చేశారు. గోవాలో చికెన్ కు ప్రాశస్త్యం ఎప్పటికీ తగ్గదని అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలే జాతి మనుగడకు ఆధారాలని చెప్పారు.