చ‌నిపోయిందా? చ‌ంపేశారా?

751

ఉద‌య‌గిరి. మార్చ్ 18, 2016 – ఉద‌య‌గిరిలో విషాదం చోటుచేసుకుంది. కొట్నిస్ హాస్పిట‌ల్‌లో వైద్యం విక‌టించి.. ఆదిల‌క్ష్మి అనే బాలింత మృతి చెందింది. పుట్టిన బిడ్డ మాత్రం క్షేమంగా ఉంది. అయితే,  వైద్యుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని ఆరోపిస్తూ.. మృతురాలి బంధువులు హాస్పిట‌ల్‌పై దాడి చేసి ఫ‌ర్నీచ‌ర్, అద్దాలు ధ్వంసం చేశారు. హాస్పిట‌ల్ ముందు ఆందోళ‌న‌కు దిగారు.  ఈ ఆస్ప‌త్రిపై నిర్ల‌క్ష్యంగా వైద్యం చేస్తార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. పేషెంట్లు చ‌నిపోయిన సంద‌ర్భంలో ఎంతోకొంత ఇచ్చి చేతులు దులుపుకోవ‌డం వీళ్ల‌కు అల‌వాటేన‌ని స్ధానికులు ఆరోపిస్తున్నారు. హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్లతో సంబంధం లేకుండా అసిస్టెంట్లు డెలివ‌రీ చేస్తున్నార‌ని తెలుస్తోంది.