బాబుకి సీబీఐ అంటే హడల్..

87

ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. విచారణ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి భయమని, తన అవినీతి బయటపడుతుందనే సీబీఐను రాష్ట్రంలోకి  రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. అవినీతిపరులంగా కాంగ్రెస్ లో చేరుతారని 2013లో చంద్రబాబు చెప్పిన మాటలను కాకాణి గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబే కాంగ్రెస్ తో కలసి ఎన్నికలకు వెళ్తున్నాడని ఎద్దేవా చేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేసే చంద్రబాబుకి ఇప్పుడు అదే సంస్థ ఎందుకు తప్పుగా కనిపిస్తోందని అన్నారు. తనపై ఆరోపణలకు మంత్రి సోమిరెడ్డి లాంటి వాళ్లతో చంద్రబాబు వివరణలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.