రేణిగుంట రైల్వే స్టేషన్లో జగన్ కు ఘన స్వాగతం..

90

ప్రజా సంకల్ప యాత్ర ముగించుకుని తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలుదేరిన వైఎస్ జగన్ ఈరోజు ఉదయం దురంతో ఎక్స్ ప్రెస్ లో రేణిగుంట చేరుకున్నారు. జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కి బయలుదేరి వెళ్లారు జగన్. ఈ మధ్యాహ్నం అలిపిరి వెళ్లి అక్కడి నుంచి కాలినడకన సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. ఈ రోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారు.