జగన్ మర్డర్ స్కెచ్ ముందు.. వెనక..

216

పది నిముషాల్లో జగన్ ని చంపబోతున్నా టీవీలో చూసుకో అంటూ జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు చివరిసారిగా ఓ మహిళతో ఫోన్లో మాట్లాడాడని తెలుస్తోంది. శ్రీనివాసరావు కాల్ డేటాని విశ్లేషించిన పోలీసులు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ముగ్గురిని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళకి శ్రీనివాసరావు కాల్ చేసి జగన్ ని చంపుతానని చెప్పాడు. శ్రీనివాసరావు ఎక్కువగా మహిళలతో ఫోన్లలో మాట్లాడేవాడని పోలీసులు నిర్థారించుకున్నారు. కనిగిరితో సహా, గుంటూరు జిల్లాలో ఒకర్ని, చిత్తూరులో ఒకర్ని కూడా ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వీరందర్నీ వైజాగ్ కి తీసుకెళ్లారు. నిందితుడు శ్రీనివాసరావు వారితో రోజూ ఎలా మాట్లాడేవాడు. జగన్ పై హత్యాయత్నం జరిగిన రోజున ఏం మాట్లాడాడనే విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు. మొత్తానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో డొంక కదులుతోంది.